లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించారు