ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో దారుణం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై రాడ్డుతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాధితురాలు కమలా నెహ్రూ కాలేజీకి చెందిన విద్యార్థిని నర్గీస్ కాగా.. ఆమెపై నిందితుడు రాడ్డుతో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.