Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్‌లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరగింది. దళిత, వెనకబడిన తరగతులకు చెందిన ఇద్దరు యువకులను తప్పుడు ఆరోపణల్లో ఇరికించి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు లైంగిక ఆరోపణ మోపి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మలం తినిపించి జుగుప్సాకరంగా వ్యవహరించారు.