ఆగస్ట్ 20వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ లో కొందరు చేసిన ఆరోపణలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. కొవిడ్ కారణంగా సినిమా రంగంలోని అన్ని విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో అంతా కలిసి మెలిసి ముందుకు సాగాల్సింది పోయి… ఓ వ్యక్తిని, ఓ నిర్మాతను టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని తెలిపింది. ఇలా వ్యక్తులను, నిర్మాతలను ఏ ఒక్క శాఖ విమర్శించినా ఊపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.…