ఏపీలో వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై 1,116 అక్రమాల పేరుతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛార్జిషీట్ విడుదల చేశారు. ఏపీలో విధ్వంసకర, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తోందని.. రివర్స్ టెండరింగ్ ఏపీని తిరోగమనంలోకి నెట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ మంత్రులు నోరులేని మూగజీవులు అని చురకలు అంటించారు. కార్పొరేషన్‌లతో ఒక్కరికి ప్రయోజనం చేకూరిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కోనసీమ అల్లర్లు సీఎం జగన్ స్పాన్సర్…