Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది.
Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కొన్ని నెలల పాటు సెలవులు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను కోరారు. బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు ఢిల్లీలోని…