తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. దీంతో.. వారందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఈసీ. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 30వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఓటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.