ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా ఉంది. కూటమి పార్టీలు, వైసీపీ పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై పోరాటం విషయంలో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్.