మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు దుండగులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అత్యాచారానికి గురైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిన్న కుల్చారంలో అత్యాచారం అనంతరం వివస్త్రని చేసి మహిళను బండ రాయికి కట్టేసి పారిపోయారు దుండగులు. Also Read:Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి…
తిరుపతి రూరల్ (మం) ఓటేరులో దారుణం వెలుగుచూసింది. పశువుల చోరీకి పాల్పడ్డారు దుండగులు. అర్థరాత్రి వేళ రెండు ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవుల కోసం కారును కొంతదూరం వెంబడించాయి దూడలు. సీసీ కెమెరా ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సూర్యకిరణ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న నలుగురు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Also Read:Meat Shops Closed:…