ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల 11వ రోజు అనగా.. అక్టోబర్ 4న భారత్ ఆశలు పెట్టుకున్న బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం కోసం పోటీ పడనున్నాడు.
ఆసియా క్రీడలు 2023 మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్‌గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.