ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 4 వికెట్స్ తీసి 24 రన్స్ ఇచ్చాడు. అజింక్యా రహానే, రింకూ సింగ్,…