Bazball: ఆస్ట్రేలియాలో జరిగిన 2025–26 యాసిస్ సిరీస్ ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. సిడ్నీ టెస్ట్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను 1–4తో చేజార్చుకున్న తర్వాత ‘బజ్‌బాల్’ ఫిలాసఫీపై పెద్ద చర్చ మొదలైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా ఈ దూకుడు విధానం ఇప్పుడు ప్రత్యర్థులకు అర్థమైపోయిందని అంగీకరించడం.. ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లో మార్పుల అవసరాన్ని స్పష్టంగా సూచిస్తోంది. సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్‌లో బాగానే కనిపించిన ప్రతిసారి ప్రత్యర్థులు…