యుఎస్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవాను 6-3, 7-6(3) తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఒక గంటా 34 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక సత్తాచాటారు. 17 ఏళ్ల సబలెంక ఆట ముందు 24 ఏళ్ల అమండా తేలిపోయారు. ఫైనల్‌లో సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలిచారు.…