జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి ఐదు సంవత్సాలు అవుతుంది. కాగా.. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్‌ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో జమ్మూ బస్టాండ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్.. జూలై 27 నుండి కుల్గామ్‌లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కాగా.. అతను 2021 నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.