ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు.
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాకాండ్ రాష్ట్రం ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి ఎనిమిది రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులు బిక్కుబిక్కుమంటు రోజులు గడుపుతున్నారు. ఇంకా అక్కడ రెస్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ సహాయ చర్యల్లో తరచూ అవాంతారాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్ నిపుణులను అధికారులు రంగంలోకి దింపారు. సోమవారం ఉదయం అంతర్జాతీయ టన్నెల్ నిపుణుడు అర్నాల్డ్…