నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో రుద్ర మెరుపు లాంటి టైటిల్స్ వినబడిన ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్‌ని చిత్రబృందం కన్ఫర్మ్ చేసినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.. ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.…
నందమూరి కళ్యాణ్ రామ్ 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ మంచి పేరు తీసుకు వచ్చింది కానీ కమర్షియల్ గా మెప్పించలేదు. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్…