కోట్ల మందిని తన పాటలతో మాయ చేసే బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్.. తాజాగా పాటలు పాడటం (Playback Singing) ఆపేస్తున్నానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వార్త విన్న ఆయన అభిమానులు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాటలకు దూరం కావడం లేదు, కేవలం…