కోలీవుడ్ స్టార్ శింబు (STR) హీరోగా, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ తీస్తున్న సినిమా ‘అరసన్’ మీద అప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. శింబు కెరీర్‌లో 49వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘అరసన్’ అంటే “రాజు” అన్న అర్థం. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే శింబు వింటేజ్ లుక్‌లో, చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామా రాబోతుందనే…