ఆర్య, ఆండ్రియా, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అరణ్మనై-3’. ఈ సినిమా మొదటి రెండు భాగాలు తెలుగులోనూ డబ్ అయ్యి విడుదలయ్యాయి. సుందర్ సి దర్శకత్వంలో ఆయన భార్య ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘అరణ్మనై-3’ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినా, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా దీని విడుదలను దర్శక నిర్మాతలు…