అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్ సైతం ధ్రువీకరించాడు. కన్నడ సంవత్సరాది…