ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు…