ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్…