ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం షాకిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ సీఎస్ కు లేఖ రాసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇవాళ సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది ఏపీజీఈఏ. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యనించింది.…