ఒక్క పులి.. అధికార యంత్రాంగాన్ని, సమీప గ్రామాల ప్రజల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో 12 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి దాడికి గేదెలు, ఆవులు, ఇతర జంతువులు గాయాల పాలవుతున్నాయి. మరికొన్ని చనిపోతూ యజమానులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి…