ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో మంగళవారం సమావేశమైంది. ఈసీతో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘అక్టోబర్ 27 వరకు ఓటర్ వెరిఫికేషన్ దేశమంతట జరిగింది. కానీ ఏపీ రాష్ట్రంలో…