ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను ఆవిష్కరించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో.. ఈ కొత్త పాలసీని విడుదల చేశారు.. ఇక, నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో చర్చించి ఆహ్వానించారు మంత్రి దుర్గేష్.. అంతేకాదు.. పెట్టుబడిదారుల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు