Rain Alert: రైతులకు గుండెదడ రప్పించిన ‘సెన్యార్’ తుఫాన్ సముద్రంలోనే బలహీన పడి ఈశాన్య ఇండోనేషియా దగ్గర తీరం దాటింది. దీని ప్రభావం మీద అనేక అంచనాలు వుండగా అండమాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించక ముందే గమనాన్ని మార్చుకుంది. తీరం దాటే సమయంలో గాలులు వేగం గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు పుంజుకుంది. వచ్చే రెండురోజులు’సెన్యార్’మరింతగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ముప్పు తప్పినప్పటికీ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.…