ఏపీలో రాజకీయాల్లో పొత్తులు ప్రారంభం అవుతున్నాయా? ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకు పైగానే సమయం వుంది. అయినా 2014 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయేమో అనిపిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సింహాన్ని ఎదుర్కొనేందుకు ఎన్ని జంతువులు ఏకమైనా ఏం చేయలేవు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయన్నారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రచారం కల్పిస్తూ రాజకీయ లబ్దికోసం ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని తాము…