ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నేతృత్వంలోనే జరగాలనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించబోతున్నారు. దానికి ఉదాహరణంగా నిన్న రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశాన్ని పేర్కొవచ్చు. ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే, సినిమా పరిశ్రమ కోరుకున్నదే జగన్ చేయబోతున్నారన్న భావన ఎవరికైనా కలుగుతుంది.…