Home
Ap Mptc Elections
Ap Mptc Elections News
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
AP MPTC and ZPTC Elections: చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, నిరసనలు చోటుచేసుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. తిరుపతి రూరల్ మండల పరిధిలోని కపిలేశ్వరస్వామి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగిన వెంకటపతి నగర్‌కు చెందిన బొర్రెడ్డివారి గజేంద్రనాథ్ రెడ్డి, కోనేరు ప్రసాద్ రెడ్డిలను తిరుపతి రూరల్ పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సాయి… -
AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది.. అయితే, తుఫాన్ ప్రభావం, ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనల కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి.. గతంలో వాయిదా పడిన పలు మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తుఫాన్ కారణంగా వాయిదా పడిన స్థానాలతో పాటు, ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల… -
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు మండలాల్లో ఇవాళ జరగాల్సిన పోలింగ్‌ను రేపటికి వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం జిల్లా పరిధిలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలాల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో అనివార్య కారణాలతో ఇవాళ జరగాల్సిన ఎన్నికలను రేపటికి మారుస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక, వాయిదా పడిన ఈ… -
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
AP MPTC ZPTC Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కొన్ని సమస్యలు వెలుగులోకి రాగా.. ఈ రోజు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి.. అయితే, ఇవాళ్టి ఎన్నికపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని వెల్లడించారు. అయితే, ఎన్నికల సందర్భంగా… -
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నికలు నిజంగా ఎన్నికలేనా? అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే తమ పార్టీ కార్యకర్తలను వేలాది మందిని బెదిరించి బైండోవర్ చేశారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ టీడీపీ నాయకులతో కుమ్మక్కై పనిచేసిందని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అనేక చోట్ల… -
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి, అధికార దుర్వినియోగంతో నిర్వహించిన వాటిని నిజమైన ఎన్నికలుగా పరిగణించగలమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలే మూలస్తంభమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల తీరుపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.… -
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎస్ఈసీ కీలక ప్రకటన..
AP MPTC, ZPTC Elections: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంతో పాటు విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్… -
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తులు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాకు ఏకగ్రీవం కాగా.. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2169… -
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించేందుకు 40,679 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు… -
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
AP MPTC, ZPTC Elections Rescheduled: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక, అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!