సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు...ప్రస్తుతం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.. భవిష్యత్తులో పెర్ఫార్మన్స్ ప్రకారం ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరు మెరుగు పర్చుకోవాలనే ఉద్దేశం తో ర్యాంక్ లు ఇస్తున్నారా.. లేకపోతే.. మంత్రులు కొన్ని అంశాల్లో వెనక బడ్డారని చెప్పడానికి ర్యాంక్ లు ఇస్తున్నారా..?
మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు అంటారు. కానీ.... ఏపీలో మాత్రం మంచో చెడో తెలియదుగానీ.... మొత్తం మైకులో చెప్పేశారు. ఇప్పుడిదే రాష్ట్రంలో చర్చోప చర్చలకు కారణం అవుతోంది. తనతో సహా... మంత్రివర్గ సహచరులందరికీ ర్యాంక్స్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. వాటి చుట్టూనే ఇప్పుడు కొత్త ప్రశ్నలు, అనుమానాలు రేగుతున్నాయట. సాధారణంగా చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే... ర్యాంకులు...గ్రేడ్లు....అంటూ రకరకాల తూనికలు-కొలతలు ఉంటాయి.