నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది.
గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు కొనసాగుతున్నాయి. ఇటీవల సంభవించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సీఎం జగన్ స్వయంగా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. గౌతమ్ రెడ్డి మరణంపై ఆయన ప్రసంగిస్తూ.. ఆ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మరణం చాలా లోటని ఆయన అన్నారు. ఆయన మరణంపై…