ఇవాళ ఏపీ బడ్జెట్టును ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు మంత్రి బుగ్గన. ఇదిలా వుంటే బుగ్గన నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు బడ్జెట్ గురించి చర్చించారు. బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు,…