కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదని, విద్యార్ధులు చదువులు మానేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదని, రూ.2200 కోట్లు బకాయి పెట్టారన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారని, ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని, అందుకే ఆరోగ్యశ్రీని ఎత్తేశారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే అని.. బాధ్యతల…