‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో హ్యాట్రిక్ సాధించిన రాజ్ తరుణ్ కు ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మరే చిత్రమూ అందించలేకపోయింది. వైవిధ్యమైన కథలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. గతంలో అతనితోనే ‘సీతమ్మ అందాలు – రామయ్య సిత్రాలు’ సినిమాను రూపొందించిన శ్రీను గవిరెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ లో తెరకెక్కిన…