సాధారణంగా చాలా మందికి పాములను చూసిన వెంటనే భయం పట్టేస్తుంది. కొందరే ధైర్యంగా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో పాములు చెట్లు, చెరువులు, పొదలు నీటమునగడం వల్ల మనుషుల నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. అడవులు, చెట్లు, నీటి వనరులను మనుషులు అధికంగా వినియోగించడం వల్ల అడవుల్లో తిరగాల్సిన జంతువులు కూడా జనావాసాల్లోకి రావడం పెరిగింది. వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువ వర్షాకాలంలో ముఖ్యంగా పాములు ఇళ్ల ప్రాంగణాల్లో, చెట్ల కింద, గదుల్లో…
వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలోని పొదలు, గుంతలు, పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాంటి సమయంలో తెలిసీ, తెలియక వాటిపై అడుగేయడం వల్ల కాటేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పదుల సంఖ్యలో పాము కాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. పాములన్నీ విషయ పూరితాలు కావు. రక్తపింజర, కట్లపాము, నాగుపాములు మాత్రం చాలా విషపూరితమైనవి.