Anna Canteens in AP : ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖలవారీగా ప్రక్షాళన చేస్తూనే… మరోవైపు కీలక పథకాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మరిన్ని…
సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నిన్న సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి దస్త్రాలపై సంతకాలు చేసారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో ని చూడండి…