ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే…
నెల్లూరు జిల్లాలో వై.సి.పి.నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా ఈ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్…మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కాకాణికి శుభాకాంక్షలు చెప్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో…
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనం కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వై.సి.పి ఎం.ఎల్.ఏగా ఉన్నారు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగానే అనం రామనారాయణ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 వరకూ కాంగ్రెస్ లో ఉన్న ఆనం..అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో టిడిపిలో చేరారు. చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించారు. కానీ ఏ పదవి కూడా ఇవ్వకపోవడం..కీలక సమావేశాలకు ఆహ్వానించక పోవడంతో కినుకు…
ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేశారు కొందరు నాయకులు. రాజకీయ అలజడి నెలకొంటే వెంటనే సీన్‌లోకి వచ్చేవారు. మంత్రులంటే వీరే అన్నట్టుగా బిల్డప్ ఉండేది. తరచూ సీఎమ్ క్యాంపు కార్యాలయానికి రావటం.. మీడియా సర్కిళ్లలో హడావిడి చేయటం మామూలే. అంతెందుకు.. ముఖ్యమంత్రికి పలానా సలహా ఇచ్చిందే నేనే.. సీఎమ్ స్వయంగా నన్ను పిలిచి మూడు గంటలుపాటు నాతో కూర్చుని చర్చించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు అని చెప్పినవాళ్లూ ఉన్నారు. ఆ అంశంపై సీఎమ్‌కు…
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నెల్లూరు జిల్లా వైసీపీలో సెగలు రేపుతోందా? రివెంజ్ పాలిటిక్స్‌కు తెరలేస్తుందా? ప్లేస్‌లు మారతాయే తప్ప.. వర్గపోరు సేమ్ టు సేమ్ అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయా? ఇంతకీ అక్కడ వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలేంటి? ఎందుకు రుసరుసలు? పుల్ల విరుపు మాటల వెనక కథేంటి? సింహపురి వైసీపీ రాజకీయాల్లో రిటర్న్‌గిఫ్ట్‌లు ఉంటాయా? తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ.. ఆప్యాయత చూపించారో.. సహకారం అందించారో అంతకు రెట్టింపు సహాయ సహకారాలు ఉంటాయని… మంత్రి కాకాణి…