మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రోజాకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని.. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.