ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు పేరుతో మోసాలు పెరుగుతున్నాయి.. ఒక్కో ఉద్యోగానికి లక్షలు డిమాండ్ చేస్తున్నారు కేటుగాళ్ళు... నిందితుల్లో ఏయూ ఉద్యోగులు ఉన్నారు.. ఉద్యోగం రాక మోసపోయి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల పేరిట మోసం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు దర్యాప్తు చెయ్యకుండ.. సమస్య పరిష్కారం జరిగిందని కేసును క్లోజ్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.