ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.