ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని…
విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్‌ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు…
ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని, ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్…
అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూను ప్రతిపాదిస్తూ బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉర్దూను అధికార భాషగా గుర్తించేలా చేసిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఏపీలో కల్తీసారా మరణాల అంశంలో శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సారా మరణాలు సహజ మరణాలు కాదని.. అవి ప్రభుత్వ…
ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అసెంబ్లీ మీడియాలో పాయింట్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… ఈఏపీసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల తేదీలను ప్రకటించారు.. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 134 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.. ఇక, ఈ పరీక్షల కోసం తెలంగాణలోనూ 4…
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం సాగుతోంది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇక, వివిధ రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు…
మహిళల భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. వారి భద్రత కోసం ప్రత్యేక దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను తీసుకొచ్చింది.. సచివాలయంలో దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 163 ఫోర్ వీలర్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలు ఏర్పాటు చేశారు.. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం…
నేడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలవనున్న తెలంగాణ మంత్రులు.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్న టీఎస్ మంత్రుల బృందం నేడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం.. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న ధామి.. హాజరుకానున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నేడు బీసీ సంఘాల ఆందోళన.. బీసీ గణన చేపట్టాలనే డిమాండ్‌తో నిరసన నేడు ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన.. రెండురోజుల పర్యటనలో బీజేపీ…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టిక్కెట్ రేట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గురించి తాను ఒకే ఒక్క మాట చెబుతానని.. మీడియా వాళ్లు రెండో ప్రశ్న అడగడానికి వీల్లేదు అంటూ కామెంట్ చేశారు. సినిమా టికెట్ల ఒక్క విషయమే కాదు అది ఏ…
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కుల జాఢ్యం ఇంకా వేధిస్తూనే ఉంది.. కులం మత్తులో ఇంకా కొంతమంది ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన గొల్ల నరేంద్ర.. అదే గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో.. వారిని ఎదిరించి రెండేళ్ల…