CM Jagan: ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈనెల 18న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, సబ్ స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నర్సాపురం బస్టాండ్, 100 పడకల ఆస్పత్రికి…
East Godavari: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజన్ డ్రగ్స్ పరిశ్రమలో ఇథైల్ కాలమ్ గొట్టంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో చాగల్లుకు చెందిన మహీధర్ ముసలయ్య, తాజ్యంపూడి వాసి రత్నబాబు, గౌరీపట్నంకు చెందిన సత్యనారాయణ…
ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే... ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చిట్‌ఫండ్స్ సంస్థల కార్యాలయాలపై ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దాడులు చేస్తోంది. విజయవాడలోని నాలుగు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మార్గదర్శితో పాటు శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ ఫండ్స్ కార్యాలయాల్లోనూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా పలు చిట్‌ఫండ్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. ఈ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నారు.. టాలీవుడ్ సూపర్ స్టార్, తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన కృష్ణ కన్నుమూయడంతో.. రేపు హైదరాబాద్ వెళ్లనున్న ఆయన.. సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించనున్నారు.. సూపర్ స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. మధ్యాహ్నం 2.20…
Tribute To Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్‌బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా ఇది మూడో విషాదం కావడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జనవరిలో సోదరుడు రమేష్‌బాబు మరణం, ఆగస్టులో తల్లి ఇందిరాదేవి మరణం, నవంబరులో తండ్రి మరణం మహేష్‌బాబును మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కృష్ణ మృతి పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా…
విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది……
కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. సైతిక శ్రీవారి శంఖు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి… విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి గుడివాడ అమరనాథ్, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, కలెక్టర్ మల్లికార్జున తదితరులు హాజరయ్యారు..…