మద్యం అమ్మకాలపై చర్చ కాస్తా.. అధికార, ప్రతిపక్షం మధ్య శాసనమండలిలో కాకరేపింది.. మద్యం విక్రయాలు, అక్రమాలపై మండలిలో మాట్లాడిన మంత్రి మంత్రి కొల్లురవీంద్ర.. మద్యం కుంభకోణంపై సిట్ వేశాం. సిట్ వేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఎంతమంది ఈ అక్రమాల్లో ఉన్నారో తేలుస్తాం... సీఐడీ విచారణలో అన్నీ తేలుస్తాం అన్నారు..