ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన–సాంకేతిక పరిశోధనల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST)’ పేరుతో తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలోని IIT–IISER కాంబినేషన్‌తో AP FIRST రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక పరిశోధనలు, ఇన్నోవేషన్‌కు వేదికగా నిలిచేలా ప్రణాళికలు…