Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశానుసారం మచిలీపట్నంలో చోటు చేసుకున్న పరిణామంపై అంతర్గత విచారణ ప్రారంభించనున్నట్లు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్, ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, మచిలీపట్నం జనసేన నాయకుడు వికృతి శ్రీనివాస్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణతోనూ మాట్లాడి…
Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ…
Ambati Rambabu : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసు రత్నం పాల్గొన్నారు. రైతుల సమస్యలపై వారు తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. “నిన్నటి…
నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్కి చేరుకున్నారు.