CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై మరోసారి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన అన్ని శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (HODs), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) లక్ష్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్…