Montha Cyclone Damage: మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా.. రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ISSF World Championships: చరిత్ర…
Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు.