Tirupati: తిరుపతి నగరంలో ఈరోజు తెల్లవారుజామున తీవ్ర విషాదం జరిగింది. మంగళం సమీపంలోని కోళ్ల ఫారాం దగ్గర నివాసముంటున్న ఉష అనే మహిళను ఆమె భర్త లోకేశ్వర్ దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిసరా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Kadapa: కడప జిల్లా చాపాడు మండలంలోని పెద్ద చీపాడు గ్రామంలో దారుణ హత్య కలకలం రేపుతుంది. అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో భర్త తన భార్యను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Vijayawada Double Murder: విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు యువకులను ఒక రౌడీ షీటర్ అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. నగరం నడిబొడ్డున గవర్నర్‌పేటలో జరిగిన ఈ జంట హత్యలతో నగరం ఉలిక్కిపడింది. నిందితుడిని రౌడీ షీటర్ జమ్ముల కిషోర్‌గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. నిత్యం గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీ షీటర్లు.. బెజవాడ వీధుల్లో వీరవిహారం సృష్టిస్తున్నారు. CM Relief Fund Scam: సెక్రటేరియట్లో దొంగలు.. సీఎం…
వివాహేతర సంబంధాలు, అనుమానాలతో హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా కాలు నరికి బైక్‌పై తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతే కాదు.. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్‌పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తాతిపల్లి వద్ద ఈ నెల 16 న జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేయడాన్ని జీర్ణించుకోలేని మస్తాన్.. షఫీని హత్య చేశాడు. షఫీ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీ కూతుర్ని తనకి ఇచ్చి వివాహం చెయ్యలేదనే కోపంతో మస్తాన్ హత్య చేసినట్లు తేలింది.
విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు…
Andhra Pradesh: మోసం చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు.. అడ్డదారులు తొక్కుతున్నారు.. ఆ నేత తెలుసు.. ఈ ఆఫీసర్ తెలుసు.. అంతెందుకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కూడా మనకు తెలిసినవారు ఉన్నారంటూ బురిడి కొట్టిస్తున్నారు.. తాజాగా, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ వ్యక్తి తనకు ఏపీ సీఎంవోలో సంబంధాలు ఉన్నాయంటూ నమ్మబలికాడు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బలహీనతపై కొట్టాడు.. ఏకంగా రూ.54 లక్షలు మోసం చేశాడు.. బాధితుల ఫిర్యాదు మేరకు మోచర్ల మహేష్ అనే వ్యక్తిపై కేసు…