West Godavari: పశ్చిమగోదావరి జిల్లా పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలికను కేవలం ఒక గంట వ్యవధిలో గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి మొగల్తూరు పోలీసులు తమ అప్రమత్తతను చాటుకున్నారు. తమ ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించి, తమ పాపను తిరిగి అప్పగించిన బీచ్ ఔట్‌పోస్ట్ పోలీసు అధికారులు, సిబ్బందికి బాలిక తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.